ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఒకరు.చాలా మంది హీరోయిన్ అవ్వాలని ఎంట్రీ ఇస్తుంటే.. ఆమె మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ఐటెమ్ గర్ల్‌గా ఫేమస్ అయింది. అదే తరహా పాటలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో దాదాపు పెద్ద హీరోలందరితో ఆడిపాడిన ఈ చిన్నది.
Also Read:Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె పై కన్నేసిన మూవీ టీం..!
తెలుగులో మాత్రమే కాదు.. దక్షిణాదిలోని తమిళం, కన్నడ భాషల్లోనూ ఐటం సాంగ్స్ చేసింది. బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా మంచి ఫేమ్ రావడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలాగే ఒడియా, బెంగాలీ భాషల్లో సైతం డ్యాన్సులు చేసి ఆకట్టుకుంది. ఇంతలా ప్రేక్షలకు ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటి గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుంది.
తనకు మోజర్ యాక్సిడెంట్ కావడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యిందట ముమైత్. ప్రజంట్ ఇప్పుడు కోలుకుంది. అంకాశాలు వస్తున్నప్పటికి తను మాత్రం బిజినెస్ ప్లాన్ లో ఉందట.‘రిసెంట్‌గా ఎంతో దైర్యం చేసి ఈ బిజినేస్ స్టార్ట్ చేశాను. దేవుడి మీద భారం వేశా. నాకు కొంత మంది సపోర్ట్ కూడా ఉంది అందుకే ముందడుగు వేశాను’ అని తెలిపింది. అలాగే మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు..కనీసం డేటింగ్ అయిన చేశారా అని ప్రశ్నించగా..
‘నేను నలుగురితో డేటింగ్ చేశాను. ఎవరితో వర్కౌంట్ అవ్వలేదు. కానీ నేను ఈ నలుగురి జెన్యూన్ గానే ఇష్టపడ్డాను టైంపాస్ మాత్రం చేయలేదు. అయిన కూడా సెట్ అవ్వలే. చాలా మంది బ్రేక్ అప్ అవ్వగానే. రిలేషన్ షిప్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు పెళ్ళి చేసుకోకూడదు.. రిలేషన్ షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది.. కిస్మత్ ని నమ్ముకుంటున్న’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.