రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి పొన్నం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులకు సంబంధించి సర్వే కొనసాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల సర్వే నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. సర్వేలో పేర్లు లేని వారు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక అర్హులందరికీ రేషన కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా అందుతాయని చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం స్థలం ఉన్న వారికే అని అపోహలు వద్దని చెప్పారు. స్థలాలు లేని వారికి కూడా ఎలా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు.. అర్హులకు కార్డులిస్తాం