Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు.. అర్హులకు కార్డులిస్తాం
- రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ
- రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు అని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. అయినా రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని చెప్పారు. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రస్తుతం 90 లక్షల కార్డులు ఉండగా 2 కోట్ల 80 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 60 వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40 లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Railway : వీళ్ల కక్కుర్తి పాడుగానూ.. రైల్వే బెడ్‌షీట్‌లను లగేజీలో దాచిపెట్టిన కేటుగాళ్లు
Also Read
రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6 కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సన్న బియ్యం పంపిణీ వల్ల 11 వేల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ప్రజా పాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేస్తున్నామని తెలిపారు. లిస్ట్‌లో పేర్లు రాని వాళ్లు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా ట్రిబ్యునల్ అంశంలో హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్ల విషయాల్లో కేసీఆర్-హరీష్ రావు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టారన్నారు. పోతిరెడ్డిపాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారని.. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 298 టీఎంసీలకు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Redmi Note 13 pro 5G: రెడ్‌మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?