రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి పొన్నం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులకు సంబంధించి సర్వే కొనసాగుతోందన్నారు.
రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.