Sridhar Babu: తెలంగాణ గ్రామ ప్రజలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. కేంద్ర సహకారంతో టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్17 ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. ఆనాడు గడీల పాలన పై పోరాడారు… తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు గడీల పాలన ని పోగొట్టి మార్పు కోరుకున్నారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత 8 నెలలుగా మేము పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేంద్ర సహకారంతో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్రాన్ని 9 వేల కోట్లు సాయం ఆడిగాము… ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నామన్నారు.
Read also: Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..
సంగారెడ్డి జిల్లా సంగుపేట నారాయణ పేట జిల్లా మద్దూరు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరామ్ పూర్ గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసామని తెలిఆపరు. ఈ సేవల్లో ఇంటర్ నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు లభిస్తాయన్నారు. ఆయా గ్రామాల్లో 360 డిగ్రీలు సిసి కెమెరాలు, ఏఐ టెక్నాలజీ వాడతామన్నారు. పైలెట్ గ్రామాల్లో రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి డిసెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నామని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నామో నిన్న సీఎం చెప్పారన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది.. రాజీవ్ ప్రాణాలను ఇచ్చారని తెలిపారు. ఆ మహనీయుని విగ్రహం పెడితే ఎందుకు అంత అసూయ.. ఈర్ష్య అని మండిపడ్డారు. అమిత్ షా, మోడీ ల దగ్గర ప్రశంసలు పొందేందుకు బిఅరెస్ రాజీవ్ విగ్రహం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు.. బీజేపీ కి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమే ఇది అని అన్నారు. హైడ్రా అనేది రాష్ట్ర వనరులను కాపాడే వ్యవస్థ… ఇతర అంశాలను డైవర్ట్ చేసేది కాదన్నారు. ఆరు గ్యారంటీల అమలు పక్కా పూర్తి చేస్తామన్నారు.
IAS Rani Kumudini: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని..