Sridhar Babu: తెలంగాణ గ్రామ ప్రజలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. కేంద్ర సహకారంతో టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ లో కిడ్నాప్ చేసిన గిరిజనులను వదిలి పెట్టారు మావోయిస్టులు. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని కిడ్నాప్ చేసారు మావోయిస్టులు. అయితే నిన్న అర్ధరాత్రి ఆ ఐదుగురు గిరిజనులను వదిలిపెట్టారు మావోయిస్టులు. ఇద్దరిని చితకబాది హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు… ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను అడవిలోకి ఎత్తుకెళ్లరు మావోయిస్టులు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.