IAS Rani Kumudini: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని..
- ఎస్‌ఈసీగారిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని..
- ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Rani Kumudini: రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో ప్రభుత్వం రాణి కుముదిని నియమించింది.
1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. ఎస్‌ఈసీగా పార్థసారధి పదవీకాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. ఫలితంగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాణి కుముదిని SEC గా నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మూడేళ్లపాటు ఎస్‌ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్ యూనియన్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా మూడేళ్లపాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Balapur Laddu: 1994 నుంచి 2024 వరకు.. బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే..
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!