Namaz: విద్యార్థులతో బలవంతంగా ‘‘నమాజ్’’ చేయించే యత్నం.. ప్రొఫెసర్ అరెస్ట్..
- విద్యార్థులు నమాజ్ చేయాలని ప్రొఫెసర్ ఒత్తిడి..
- ఛత్తీస్‌గఢ్ ఎన్‌సీసీ క్యాంప్‌లో ఘటన, ప్రొఫెసర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namaz: ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) క్యాంపులోని విద్యార్థులతో ఓ ప్రొఫెసర్ బలవంతంగా నమాజ్ చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో 8 మందిపై ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ప్రొఫెసర్ దిలీప్ ఝాను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రష్మీత్ కౌర్ చావ్లా తెలిపారు.
దిలీప్ ఝాతో పాటు గురు ఘసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరంతా మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం, మతపరమైన భావాలను దెబ్బతీయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
Read Also: High Court: వివాహ “బంగారం” మహిళ ఆస్తి.. విడాకుల తర్వాత తిరిగి ఇవ్వాల్సిందే..
మార్చి 31న జిల్లాలోని కోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని శవతరాయ్ గ్రామంలో మార్చి 26- ఏప్రిల్ 01 మధ్య ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితులు 159 మంది విద్యా్ర్థులతో నమాజ్ చేయించేందుకు బలవంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, మొత్త విద్యార్థుల్లో నలుగురు మాత్రమే ముస్లింలు అని అధికారులు గుర్తించారు. విద్యార్థులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. బిలాస్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రజనేష్ సింగ్ ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి నగర పోలీసు సూపరింటెండెంట్ (కొత్వాలి) అక్షయ్ సబద్ర నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా, ఝా మరియు ఇతరులపై కేసు నమోదు చేయబడింది. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చావ్లా తెలిపారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!