HYD Metro: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేస్తాం: ఎన్వీఎస్ రెడ్డి
- త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేస్తాం.. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకు వెళ్తున్నాం.. హైదరాబాద్ మెట్రో తెలంగాణకు గర్వ కారణం: మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD Metro: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం.. ప్రపంచంలో చాలా దేశాలతో పాటు మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సిస్టమ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విజవంతం కాలేకపోయిందన్నారు. ఇక, మొదటి దఫాలో 69 కిలో మీటర్లలో 57 స్టేషన్లు ఉన్నాయి. అవి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య 29 కిలోమీటర్ల ఉంది.. అలాగే, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య 11 కి.మీటర్లు.. నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 29 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ఇక, ఒకప్పుడు మెట్రో వద్దని నగరంలో అనేక ఆందోళనలు జరిగాయి.. కానీ ఇప్పుడు మెట్రో కావాలని అడుగుతున్నారు.. నా దిష్టి బొమ్మలు కాల్చిన వారు.. ఈరోజు సన్మానాలు చేస్తున్నారని నా పుస్తకంలో రాశానని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Pushpa 2: అస్సలు తగ్గేదేలే.. భారీ రన్ టైం లాక్? ఆ మాత్రం ఉండాల్సిందే
Also Read
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
అలాగే, గతంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో గతంలో రెండవ స్థానంలో ఉండేది అని మెట్రో రైల్ మేనెజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు మనం గత కొన్నేళ్లుగా రెండో దశ పనులు ప్రారంభించుకోలేక పోయామన్నారు. దీంతో మనం మూడవ స్థానంలోకి పడిపోయాం.. బెంగుళూరు, ఇతర నగారాల్లో చాలా స్పీడ్ గా ఫేస్ లు వారీగా పనులు జరుగుతున్నాయి.. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో నేను చెప్పడం జరిగింది.. ఇలాగే మనం రెండవ దశ పనులు ప్రారంభం చేయకపోతే లాస్ట్ కి పడిపోతమని తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో సిఎం రేవంత్ చాలా పకడ్బందీ ప్రణాళికతో వెళ్దామన్నారు.. మాకు ఇచ్చిన ఇంస్ట్రక్షన్ లో ఆర్డినరీ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలన్నారు.. అభివృద్ధి అంటే కేవలం పశ్చిమ దిక్కు మాత్రమే కాదు నగరం మొత్తం ఉండాలన్నారు. ఇక, 76.4 కిలో మీటర్ల కోసం 5 కారిడార్లు కోసం ప్రిపేర్ చేశామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Read Also: Prabhas: విదేశాలకు ప్రభాస్.. ఆ హీరోయిన్‌లలో ఎవరితో రొమాన్స్?
కాగా, కేంద్ర ప్రభుత్వం 90 శాతం R O W కావాలని కోరింది. ఒక్కో చోట ఫ్లై ఓవర్ కొన్ని చోట్ల ఫ్లై ఓవర్ పై నుంచి మెట్రో రైల్ ను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్ టు శంషాబాద్ 36.8 కిలో మీటర్లు.. రాయదుర్గం టూ కోకపేట్ 11. 6 కిలోమీటర్లు.. ఎంజీబీస్ – చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ.. మియాపూర్ నుంచి పటాన్ చెరువు 13.4 కిలోమీటర్లు.. ఎల్బీనగర్ టూ హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు .. చంద్రయాన్ గుట్ట వద్ద జంక్షన్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందన్నారు.
Read Also: Pan Card 2.0 Use: QR కోడ్‌తో వస్తున్న కొత్త పాన్ కార్డ్.. ఫీచర్లు ఏంటంటే
ఇక, హైదరాబాద్ రోజురోజుకి విస్తరణ జరుగుతోంది.. హయత్ నగర్ టూ పఠాన్ చెరువు మధ్య 50 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా ఒకే కారిడార్ కిందకు రాబోతుంది.. దీంతో మెట్రో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జనరల్ ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది.. సమయం కూడా తగ్గుతుందన్నారు. అలాగే, ఎయిర్ పోర్ట్ కారిడార్.. నాగోల్ టూ శంషాబాద్ విమానాశ్రయం యావరేజ్ స్పీడ్ 35 కిలోమీటర్లు ఉంటుంది.. ఇదీ స్ట్రెయిట్ లైన్ దీంతో ఇంకా స్పీడ్ పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి.. దీని మధ్య దూరం 36.8 కిలో మీటర్లు ఉండనుంది. అలాగే, రాయదుర్గం నుంచి కోకపేట్ మధ్య 11.6 కిలో మీటర్ల మేర దూరం ఉండనుంది. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి.
Read Also: Sri Tej: యువతి ఫిర్యాదు.. సినీ హీరోపై కేసు నమోదు!
ఎంజీబీస్ టూ చంద్రయాన్ గుట్ట మధ్య 7.5 కిలో మీటర్ల దూరానికి 6 స్టేషన్లు ఉంటాయి. శాలిబండ పేరు పైన కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. షా అలి బండ అని పెట్టామన్నారు.. ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ చేస్తున్నాం.. అందరూ అభిప్రాయాలతో ఏదీ బాగుంటే అదే పేరు పెడుదాం.. అలాగే, మియాపూర్ టూ పఠాన్ చెరువు మధ్య 10 స్టేషన్లతో 13.4 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ రానుంది.. కేవలం 1.6 కి.మీ వరకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ 7.1 కిలో మీటర్లకు 6 స్టేషన్లు ఉండనున్నాయి. దీంతో పాటు ఎయిర్ పోర్ట్ ఏరియాలో 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మెట్రో రానుంది.. ఇప్పుడు డబుల్ డ్యూ గడర్ సిస్టమ్ కి వెళ్తున్నాం.. ప్రభుత్వ విధానంలో చేయబోతున్నాం.. కాబట్టి ఫ్లెక్సిబులిటీ ఎక్కువగా ఉంటుందన్నారు. మెట్రో దిగటానికి ఎక్కడానికి కూడా ఇంకా ఎక్కువ వెసులుబాటు సౌకర్యాలు కల్పించబోతున్నాం.. ఎయిర్ పోర్ట్ కారిడార్ 3లక్షల 70 వేల మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది.. మియాపూర్ నుంచి పఠాన్ చెరువు రూట్ లో 1.70 లక్షల వరకు ప్రయాణం చేసే ఛాన్స్ ఉందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!