Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- ఘోర రోడ్డు ప్రమాదం
- రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన కారు
- ఆర్మీ జవాన్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narsingi Road Accident: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్షాకోట్ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన కారు
స్థానికుల సమాచారం ప్రకారం.. మహీంద్రా XUV కారు రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి ముందుగా ఓ ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిపోయిన కారు మరికొందరిని కూడా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
కారులో ఐదుగురు యువకులు
ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగంతో పాటు రాంగ్ రూట్లో అడ్డగోలుగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న యువకుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?