Pushpa 2: అస్సలు తగ్గేదేలే.. భారీ రన్ టైం లాక్? ఆ మాత్రం ఉండాల్సిందే
- డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
- భారీ రన్ టైం లాక్
- ఆ మాత్రం టైం ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అయితే.. పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియా అంచనాలకు మించి.. సుక్కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతున్నాడు. ఏం జరిగినా సరే.. తాను అనుకున్న అవుట్ పుట్ రావాల్సిందేనని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే రన్ టైం విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఈ సినిమాకు దాదాపు మూడున్నర గంటల వరకు భారీ రన్ టైం వచ్చిందని వార్తలు రాగా.. ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్లుగా సమాచారం.
పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకుడు థియేటర్లో మూడున్నర గంటల సమయం కేటాయించాల్సిందే. కానీ ఇంతసేపు ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్.. ఇలా అన్ని నెక్స్ట్ లెవల్లో ఉండాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాలో వచ్చే ప్రతీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాబట్టి పుష్పగాడి రూలింగ్‌కు ఆ మాత్రం టైం ఉండాల్సిందేనని చెప్పొచ్చు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: Sri Tej: యువతి ఫిర్యాదు.. సినీ హీరోపై కేసు నమోదు!
ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మూడు గంటలకు అటు ఇటుగా రన్ టైంతో వస్తున్నాయి. హిట్ టాక్ వస్తే ఒకే కానీ.. లేదంటే పది, పదిహేను నిమిషాలు ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. కానీ పుష్ప రాజ్‌కు యమా క్రేజ్ ఉంది కాబట్టి.. ఈ రన్ టైంను పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. ఇక డిసెంబర్ 5న పుష్పగాడి మాస్ జాతరకు బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే ఏకంగా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని, కుదిరితే ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న 223 కోట్ల రికార్డ్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!