హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం.. సిఎం రేవంత్ చాలా పకడ్బందీ ప్రణాళికతో వెళ్దామన్నారు.. మాకు ఇచ్చిన ఇంస్ట్రక్షన్ లో ఆర్డినరీ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలన్నారు.. అభివృద్ధి అంటే కేవలం పశ్చిమ దిక్కు మాత్రమే కాదు నగరం మొత్తం ఉండాలన్నారు.