John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందుంటుంది. కండలు తిరిగినా శరీరాకృతి, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన ముద్ర వేశారు ఈ హీరో. అయితే ఆయన మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో టాప్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ అబ్రహం కెరీర్‌ను పరిశీలిస్తే యాక్షన్ థ్రిల్లర్లకు ఆయన ఎంతగా సరిపోతారో అర్థమవుతుంది. ‘ఫోర్స్’, ‘ధూమ్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న జాన్, తర్వాత కూడా ఇదే జానర్లో అనేక సినిమాలు చేశారు. ఇప్పుడు జాన్ అబ్రహం మరో డబుల్ రోల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించే అవకాశం ఉందనే వార్త బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు శివమ్ నాయర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో యాక్షన్, స్పై థ్రిల్లర్ చిత్రాలకు పేరుగాంచిన ఈ దర్శకుడు ‘ఆహిస్తా ఆహిస్తా’ (2006) సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ‘భాగ్ జానీ’ (2015) చిత్రాలను తెరకెక్కించారు. తాప్సీ పన్ను లీడ్ రోల్లో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ‘నామ్ శబానా’ (2017) (తెలుగులో ‘నేనే శబానా’) చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించగా, ఇటీవల జాన్ అబ్రహం హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా ‘ది డిప్లొమాట్’ (2025) అనే పొలిటికల్ థ్రిల్లర్‌ను కూడా రూపొందించారు. మారోసారి ఈ కాంబో పట్టాలెక్కబోతుండగా, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలోనే ఉందని, కథకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త చిత్రంలో జాన్ అబ్రహంతో పాటు నటించబోయే మరో హీరో ఎవరు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇదిలా ఉంటే జాన్ అబ్రహం చేతిలో ఇప్పటికే రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘రాకేష్ మరియా’లో ఆయన నటించనున్నారు. అలాగే ఆయన కెరీర్లో కీలకమైన యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫోర్స్ 3’ కూడా రాబోతోంది. ఈ చిత్రంలో జాన్‌తో పాటు హర్షవర్ధన్ రాణే నటిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. దీంతో ‘ఫోర్స్ 3’ కూడా డబుల్ హీరో యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు శివమ్ నాయర్ దర్శకత్వంలో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త సినిమా కూడా డ్యూయల్ హీరో యాక్షన్ కథ కావడం ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జాన్ అబ్రహం, శివమ్ నాయర్ కాంబినేషన్‌పై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే మాత్రం, జాన్ అబ్రహం అభిమానులకు మరో భారీ యాక్షన్ ట్రీట్ సిద్ధమైనట్టే.
- Tags
- cinema
- John Abraham
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!