V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కారును గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటి ముందు ఆగి ఉన్న తన కారును ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అనంతరం దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పారిపోయారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వీహెచ్ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై విహెచ్ మాట్లాడుతూ.. తనపై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందు ఆగి ఉన్న కారును మరో వాహనంతో ఢీకొట్టిన దుండగులు పారిపోయారని వీహెచ్ పోలీసులకు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
దాడికి గల కారణాలను కూడా తెలుసుకోవాలని వీహెచ్ కోరారు. అనంతరం దాడికి గురైన కారును పోలీసులు తనిఖీ చేశారు. చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి వీహెచ్‌కు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. వీహెచ్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాలను పరిశీలించారు. ఢీ కొట్టని వాహనం ఎవరు నడిపారు? వాహన నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితున్ని అదుపులో తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. కాగా, గతంలో కూడా వి.హనుమంతరావు కారుపై దాడి జరిగింది. ఏప్రిల్ 14, 2022 అర్ధరాత్రి, వీహెచ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఇనుప రాడ్‌తో అద్దాలు పగలగొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వీహెచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వికాస్ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.
Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..