Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..
- నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది..
- ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..
- గుండపల్లిలో ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నం..
- పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmal: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు 20 మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు గుండంపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు రెండు వాహనాల్లో వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పురుగుల మందు డబ్బాలతో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏది ఏమైనా ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Read also: Nizamabad: క్లినిక్ లపై తెలంగాణ వైద్య బృందం తనిఖీలు.. నకిలీ వైద్యుల గుట్టు రట్టు..
Also Read
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ వద్ద జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. దిలావర్ పూర్ లో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రోడ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కనిపించడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారు నిరసన తెలుపుతుండగా ఆర్డీఓ రత్న కల్యాణి అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సుమారు మూడు గంటల పాటు రత్న కల్యాణి వాహనం అక్కడే నిలిపివేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. వారంతా రోడ్డుపైనే వంటలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు అనగా 24 గంటలుగా ఉద్రిక్తల నడుమ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Adani Group: అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!