CM Revanth Reddy: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
- నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..
- ఈరోజు ఉదయం 11.54 గంటలకు భూమిపూజ కార్యక్రమం..
- కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర్ రాజనర్సింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు (జనవరి 31) ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఈ ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం దవాఖాన అఫ్జల్‌గంజ్‌లో ఉండగా.. నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించబోతున్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవనం కార్పొరేట్ హస్పటల్స్ ను తలదన్నేలా ప్రభుత్వం నిర్మించాలని ప్లాన్ చేస్తుంది.
Read Also: Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
ఇక, రాబోయే వందేళ్ల పాటు ప్రజల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో తెలిపారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు ఒక పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఉండాలన్నారు. అలాగే, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నొస్టిక్ సేవలు ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో ఈ నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.2700 కోట్ల వరకు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20 శాతం వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల రోజుకు ఐదు వేల మంది ఓపీ రోగులను చూడటంతో పాటు 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది.
తాజావార్తలు
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?