Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రజంట్ హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఆశించిన ఫలితాలను దక్కించుకోలేక పోయ్యాడు. దాదాపు 10 కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమాలోనూ నటిస్తున్నారు. ఇవే కాకుండా అటు డైరెక్టర్ వెట్రిమారన్‌తో వాడివాసల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చడట. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే సూర్య మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు. ముఖ్యంగా వారిది ఉమ్మడి కుటుంబం కనుక ప్రతి ఒక పండుగను సూర్య ఫ్యామిలితో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా తాజాగా సూర్య తన తండ్రి గురించి ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..
విషయం ఏంటి అంటే ఇటీవల, భారత తపాలా శాఖ, ‘TANAPEX 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, సూర్య తండ్రి అయిన నటుడు, కళాకారుడు శివకుమార్ చిత్రాల ఆధారంగా ‘తమిళనాడు 1960ల’ పేరుతో చిత్ర పోస్ట్‌కార్డ్ ఆల్బమ్‌ను విడుదల చేసింది.ఈ గౌరవాన్ని ప్రస్తావిస్తూ, సూర్య తన టైమ్‌లైన్‌ని ఎక్స్‌లో ‘అభిరుచి కళను టైమ్‌లెస్ చేస్తుంది. వాటర్ కలర్, స్పాట్ పెయింటింగ్ పట్ల మా నాన్నకు ఉన్న నిస్వార్థ ప్రేమ ఇప్పుడు భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పోస్ట్‌కార్డ్‌లుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజు మరింత గర్వంగా ఉంది అప్పా’ అంటూ పోస్ట్ పెట్టాడు.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఇక చెన్నై సిటీ రీజియన్ జారీ చేసిన ఈ పోస్ట్‌కార్డ్‌లలో మౌంట్ రోడ్‌లోని ప్రసిద్ధ ఎల్‌ఐసి భవనం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తంజావూరు పెద్ద దేవాలయం, బృహదీశ్వరార్ ఆలయం, తిరుచ్చి రాక్ ఫోర్ట్, ది. ధున్ బిల్డింగ్, మహాబలిపురం రథాలు, ఏకాంబరేశ్వర ఆలయం, జింగీ కోట, తిరువణ్ణామలై ఆలయం, డ్యూప్లెక్స్ వీధి పాండిచ్చేరి, మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం, కోర్ట్రాలం జలపాతాలు, కేప్ కోమోరిన్ వంటి అద్భుతమైన ప్లేస్ లు ఉన్నాయి.
“Passion makes art timeless”. My dad’s selfless love for watercolor and spot painting is now immortalized as postcards by the Indian Postal Department. Even more proud today Appa. #ActorSivakumar #PostCards #1960s pic.twitter.com/Y6dBUfbtvA
— Suriya Sivakumar (@Suriya_offl) January 29, 2025
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!