Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఈరోజు గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయి ప్రవేశం చేసి, సీఎం పదవి చేపట్టిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న ముగింపు సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జన నాయకుడు‘ పేరిట విడుదల చేస్తున్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా బిజినెస్ మరియు ప్రీ-బుకింగ్స్ లెక్కలు చర్చనీయాంశంగా మారాయి.
గతంలో విజయ్ నటించిన సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ ఓపెనింగ్స్ దక్కేవి. కానీ ‘జన నాయకుడు’ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-బుకింగ్ సేల్స్ అంతంత మాత్రమే ఉండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా నందమూరి బాలకృష్ణ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ అధికారిక రీమేక్ కావడమే. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్లలోనూ ఓటీటీలోనూ చూసేసిన కథ కావడంతో మళ్లీ థియేటర్లకు వచ్చి చూడటానికి ఆసక్తి చూపించడం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.మరోవైపు తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఇమేజ్, చివరి సినిమా అన్న ఎమోషన్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే రాబట్టింది. అయితే విజయ్ గత చిత్రాలతో పోలిస్తే ఓవర్సీస్ మార్కెట్లో ప్రీ-సేల్స్ కొంత మందగించాయి. విజయ్ గత బ్లాక్‌బస్టర్ ‘లియో‘ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 146 కోట్లతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించగా ఆ రికార్డును జన నాయగన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. లియో థియేట్రికల్ రైట్స్ రూ. 215 కోట్లకు అమ్ముడవ్వగా కలెక్షన్లలో దాదాపు రూ. 302 కోట్లకు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. గోట్ మొదటి రోజు రూ. 104 కోట్ల వసూళ్లు సాధించగా రూ. 185 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌కి గాను మొత్తంగా ₹225 కోట్లు రాబట్టింది. జన నాయగన్ ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 240 కోట్లుగా నమోదైంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే ‘జన నాయగన్’ ప్రారంభ దినోత్సవం నుంచే భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఊపునిచ్చినప్పటికీ, తెలుగు మరియు ఓవర్సీస్ మార్కెట్లలో టాక్ బాగుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ దాటి భారీ ప్రాఫిట్స్‌లోకి వెళ్లే అవకాశముంది
Also Read
- Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
- World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
- Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
- Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
తాజావార్తలు
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!