CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు (జనవరి 31) ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు.
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కోట్ల మంది ప్రజల కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణం కాబోతోంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు.. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు.. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు.. ఇలా ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కొత్త…