Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్గా నిలిచే ‘మీభూమి–బ్లాక్ చెయిన్’ వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం వెబ్ల్యాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటం వల్ల డేటా వ్యత్యాసాలు, రికార్డుల్లో మార్పులను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి–బ్లాక్ చెయిన్ వ్యవస్థను రూపొందించారు.
NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటరాఫ్ ఎక్స్ లైన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థలో ప్రతి భూ పార్సెల్కు ప్రత్యేక బ్లాక్ చెయిన్ గుర్తింపు కల్పిస్తారు. ప్రతి లావాదేవీ టాంపర్-ప్రూఫ్, సెక్యూర్టీతో జరగనుంది. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పు చేయాలన్నా ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ సేవల ద్వారానే ఇకపై సాధ్యమవుతుంది. ఒక భూ పార్సెల్కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు, వాటి ప్రతి వెర్షన్తో సహా శాశ్వతంగా నమోదయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇక ప్రతి లావాదేవీని ఏ అధికారి, ఎప్పుడు నిర్వహించారనే వివరాలు కూడా శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి. రికార్డుల్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే లావాదేవీ వెంటనే ఆగిపోయేలా వ్యవస్థను రూపొందించారు.
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఈ వ్యవస్థలో ప్రస్తుతం ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్, ఎక్స్టెంట్ కరెక్షన్ సహా ఎనిమిది పౌర సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయం, మత్స్యశాఖ, గనులు, పరిశ్రమలు, విద్యుత్ శాఖ, సీఆర్డీఏ, ఆర్థిక సంస్థలు వంటి విభాగాలు కూడా అవసరమైన మేరకు ఈ సమాచారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. మొదటి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలోని అస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో 89 రీ-సర్వే గ్రామాలు, 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్లు కవర్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..