Indiramma Housing App: ఇందిరమ్మ ఇళ్ల యాప్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5న సచివాలయంలో ఈ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read also: Delhi : ఢిల్లీలో త్రిపుల్ మర్డర్.. పెళ్లి రోజే విషాదం.. తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను సీఎం ఆవిష్కరించిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ యాప్‌లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ నంబర్, ఆ వ్యక్తికి సొంత భూమి ఉందా? లాంటి 30-35 ప్రశ్నలు ఉంటాయి. అతని ఆదాయం ఎంత? గతంలో ఏదైనా గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందారా? అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. వీటి ఆధారంగా దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులా కాదా అనేది తేలుతుంది.
Read also: Triple Murder: దారుణం.. తెల్లారుజామున ఒకే ఇంట్లో ముగ్గురి కుటుంబసభ్యుల హత్య
మొదటి దశలో సొంత భూమి ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను అందించాలని నిర్ణయించారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. వికలాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండో దశలో ఇల్లు లేని వారికి అవకాశాలు కల్పించనున్నారు. కాగా.. గత నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సమగ్ర ఇంటింటి సర్వే కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే..
Tragedy: విషాదం.. మిద్దె కూలి ముగ్గురు మృతి