Tragedy: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షానికి నాని పాత మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న , శ్రీదేవి,సంధ్యలుగా గుర్తించారు. అంత్యక్రియలు కోసం తక్షణ సహాయం కింద రూ.50 వేలు రూపాయలను ఎమ్మెల్యే సురేంద్రబాబు తరుపున టీడీపీ నాయకులు అందజేశారు.
Read Also: Triple Murder: దారుణం.. తెల్లారుజామున ఒకే ఇంట్లో ముగ్గురి కుటుంబసభ్యుల హత్య