BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లు కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది.
CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.