The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ ఓ రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపించాడు. సంజయ్ దత్ లుక్ కూడా అదిరిపోయింది. కానీ అసలైందే మిస్ అయింది. అదే ఓల్డేజ్ ప్రభాస్ లుక్. ఫస్ట్ లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ప్రభాస్ ఓల్డేజ్ లుక్ విపరీతంగా ట్రెండ్ అయింది.
Read Also : Mega-Anil Movie : మెగా-అనిల్ మూవీలో రేపటి నుంచే నయన్ జాయిన్..
టీజర్ లో ఆ లుక్ చూపిస్తారని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. కానీ నిరాశే ఎదురైంది. ఆ లుక్ ను చూపించలేదు. తలకిందులుగా ఉన్న ఓ లుక్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అందులో క్లారిటీగా చూపించలేదు. ఈ పాత్రను కావాలనే దాచిపెట్టారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్ దత్, రాజాసాబ్ పాత్రలకు లింక్ ఉండొచ్చు.
సినిమాకు ఆ పాత్రనే కీలకం కాబట్టి రివీల్ చేయలేదేమో. బిగ్ స్క్రీన్ పై సర్ ప్రైజ్ ఇవ్వడానికే ఆ పాత్రను హోల్డ్ చేసేశాడు మారుతి. ఇప్పటి వరకు చూడని కొన్ని విజువల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ కూడా అదిరిపోతుందని టాక్. మరి మూవీ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also : The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్.. ముగ్గురిని దించిన మారుతి..