CM Revanth Reddy: తెలంగాణకు శాపంగా మారిన బీఆర్ఎస్ నిర్ణయాలు..
- బీఆర్ఎస్ చెబుతున్న అబద్ధాలను జనంలోకి తీసుకెళ్లాలి..
- కేసీఆర్, హరీష్ రావులు నీటి కేటాయింపులు సాధించలేదు..
- తెలంగాణకు శాపంగా మారిన బీఆర్ఎస్ నిర్ణయాలు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రజాభవన్ లో బనకచర్ల ప్రాజెక్టు పైనా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నీళ్ళకు తెలంగాణ ప్రజలకు అనుబంధం ఉంది.. నీళ్లలో జరిగిన అన్యాయం పైనే తెలంగాణ ఉద్యమం కొనసాగింది.. నీళ్ల విషయంలో అందరిదీ ఏకాభిప్రాయమే.. తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్, హరీష్ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Mrunal Thakur: మృణాల్’ను ఇంకా దాస్తారట!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఇక, కృష్ణా నదిలో 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు చాలు అని కేసీఆర్ సంతకం చేసి వచ్చిండు అని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. అప్పుడు కూడా మేం అభ్యంతరం వ్యక్తం చేశాం.. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు చేయాలని మేం వాదించాం.. 2020లో కూడా 299 టీఎంసీలు చాలు అని చెప్పారు.. కేసీఆర్, హరీష్ రావులు నీటి కేటాయింపులు సాధించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి చేయలేదు.. కేంద్రానికి కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ముందుకు రాలేదు.. తెలంగాణకి మరణ శాసనం రాశారు కేసీఆర్, హరీష్ రావు అని మండిపడ్డారు. అలాగే, కేసీఆర్ తన దాహం తీర్చుకోవడానికి.. కాళేశ్వరం పేరుతో అంచనాలు మార్చాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి షేప్ రావాలంటే.. ఇంకో 50 వేల కోట్లు కావాలి.. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు ఇచ్చారు నీరు.. 7 వేల కోట్ల కరెంట్ బిల్లులు అయ్యాయి.. మరో 118 టీఎంసీల నీటిని సముద్రంలో కలిపారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై రిపోర్ట్ సిద్ధం.. కారణాలు తెలిసే అవకాశం..
అయితే, గోదావరిని పూర్తిగా వాడుదామంటే నీళ్ల కేటాయింపు సమస్య, నిధుల సమస్య వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ చెప్తున్న అబద్ధాలు.. మీరు జనంలోకి తీసుకెళ్లాలి అని సూచించారు. నదులు పునరుజ్జీవం కోసం కాదు.. బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. అందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.. ఫామ్ హౌస్ లో ఉండి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమాభారతి దగ్గరకి వెళ్లి 3 వేల టీఎంసీల నీళ్ళు ఉన్నాయని కేసీఆర్ అన్నాడో అప్పుడే సమస్య మొదలైంది. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకుపోతామన్నారు.. రోజా ఇంటికి వెళ్ళి.. గోదావరి నీళ్లు ఇస్తామని కేసీఆర్ అన్నారు.. కేసీఆర్ వైఖరి.. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తె ఏం ఇస్తావు అన్నట్టు ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!