GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- చిత్తూరు జిల్లాలో వెలుగులోకి భారీ జీఎస్టీ స్కామ్ వ్యవహారం..
- స్క్రాప్ వ్యాపారం పేరుతో..
- అమాయకుల ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నట్లు ఆరోపణలు..
- బాధితుల పేర్లపై నకిలీ జీఎస్టీ, బ్యాంక్ ఖాతాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Scam: చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వస్తున్న జీఎస్టీ స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. స్క్రాప్ వ్యాపారం పేరుతో అమాయకుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్లపై నకిలీ జీఎస్టీ ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు తెరిచి భారీగా లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు బయటపడుతున్నాయి. చిన్న వ్యాపారులకు కొంత నగదు ఆశ చూపి వారి పత్రాలు తీసుకుని, ఆ తర్వాత కోట్ల రూపాయల స్క్రాప్ లావాదేవీలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
జీఎస్టీ నోటీసులు అందిన తర్వాత బాధితులకు అసలు విషయం తెలిసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్ తన ఆధార్, పాన్ కార్డులను అక్రమంగా ఉపయోగించి స్క్రాప్ లావాదేవీలు నిర్వహించారని పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా స్క్రాప్ జీఎస్టీ స్కామ్‌లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్తూరుకు చెందిన రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గత ఏడేళ్లుగా ఈ తరహా వ్యవహారం సాగినట్లు ఆరోపణలు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అరెస్ట్ చేసిన రెహమాన్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ఇప్పుడు పోలీసులపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. వందల కోట్ల స్కామ్ ఆరోపణలున్న కేసులో స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ జీఎస్టీ స్కామ్ వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత పెద్దది..? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు..? అన్నది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!