ముందుగా హిందీలో సీరియల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించిన మృణాళ్ ఠాకూర్ తెలుగులో కూడా సీతారామం లాంటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన హాయ్ నాన్న సినిమా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆమె చేసిన ఫ్యామిలీ స్టార్ అంతగా కలిసి రాకపోయినా తెలుగులో ఆమెకు మంచి మంచి ప్రాజెక్టులు పడ్డాయి.
ALso Read:Vishwambhara: విశ్వంభర వెయిటింగ్… వర్త్ వర్మా వర్తు!
ఇప్పటికే ఆమె పలు ప్రాజెక్టులలో భాగమవగా అల్లు అర్జున్‌తో అట్లీ చేస్తున్న సినిమాలో కూడా ఒకానొక హీరోయిన్‌గా ఎంపికైంది. నిజానికి ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్టు దాదాపుగా టాలీవుడ్ వర్గాల అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు సినిమా టీమ్ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. నిజానికి ప్రమోషనల్ షూట్‌లో కూడా మృణాళ్ పాల్గొన్నది.
ALso Read:Dhanush: హోంపిచ్ పై కన్నేసిన ధనుష్ ?
త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఆ అనౌన్స్‌మెంట్ వాయిదా వేసినట్లుగా సమాచారం. ఎందుకు వాయిదా వేశారనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ త్వరలోనే ఆమె గురించి అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మృణాళ్ చేతిలో ప్రస్తుతం ఈ సినిమా మాత్రమే కాదు, సన్నాఫ్ సర్దార్ 2తో పాటుగా డకాయిట్ అనే సినిమాలో ఆమె నటిస్తోంది.