Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- నవంబర్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
- అభ్యర్థులపై కాంగ్రెస్‌లో జోరుగా కసరత్తు
- సామాజిక సమీకరణాలపై అధిష్టానం ఫోకస్
- ఆశావహుల పేర్లపై కొనసాగుతున్న చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఖాళీ కానున్న శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం నవంబర్ మూడో వారంలో ముగియనుండటంతో, ఆ స్థానాలను సకాలంలో భర్తీ చేసేందుకు అధిష్టానం ప్రాథమిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులోగా జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆశావహుల పేర్లపై సమగ్రంగా చర్చించి, ఆమోదించిన ప్రతిపాదనలను రాజ్‌భవన్‌కు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న వారంలో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది.
సామాజిక వర్గాల ప్రాధాన్యం.. రేసులో నిలిచిన ప్రధాన పేర్లు
ఈసారి ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలో సామాజిక సమతుల్యతకు కాంగ్రెస్ నాయకత్వం పెద్దపీట వేయాలని భావిస్తోంది. గతంలో సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఒక స్థానాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వర్గం నుంచి స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబ సభ్యులతో పాటు కైలాస్ నేత, అనిల్ పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒకదానిని ఎస్సీ (మాదిగ) వర్గానికి కేటాయించాలని అధిష్టానం యోచిస్తుండగా, ఈ రేసులో దొమ్మాట సాంబయ్య, చారకొండ వెంకటేష్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అలాగే మూడో స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించే దిశగా పార్టీలో చర్చ జరుగుతుండగా, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
పరిశీలనలో మరికొందరు కీలక నేతలు
కేవలం సామాజిక సమీకరణలే కాకుండా పార్టీకి, ప్రభుత్వానికి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న మరికొందరు సీనియర్ నేతల పేర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ జాబితాలో సమాచార హక్కు కమిషనర్ (RTI) అయోధ్య రెడ్డితో పాటు గాంధీ భవన్ ఇన్చార్జి కుమారావు పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. రాబోయే రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సమర్థులైన అభ్యర్థులను ఖరారు చేసేందుకు పీసీసీ, అధిష్టానం చివరి విడత చర్చలు జరుపుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!