Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా వచ్చిన ఒక కుటుంబంలో ఈ ప్రమాదం కోలుకోలేని నింపింది. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారితో పాటు ఆమె బంధువు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ అల్వాల్ పరిధిలోని జొన్నబండ ప్రాంతానికి చెందిన చిన్నారి సరాక్షి (6) పుట్టినరోజు కావడంతో, కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె జన్మదినాన్ని నగరంలో ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
సినిమా చూసి వచ్చి.. రోడ్డు దాటుతుండగా లారీ రాకాసి
పాప పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులంతా కలిసి మొదట కూకట్‌పల్లిలోని పీవీఆర్ (PVR) థియేటర్లో సినిమా చూశారు. అనంతరం రాత్రి వేళ ట్యాంక్‌బండ్ వాతావరణంలో హుస్సేన్‌సాగర్ ఒడ్డున కేక్ కట్ చేయాలని భావించి అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న మగ్గం మోయుద్దీన్ విగ్రహం సమీపంలో తమ కారును పార్క్ చేశారు. కారు దిగి కేక్ కటింగ్ కోసం హుస్సేన్‌సాగర్ వైపు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది.
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ఘటనా స్థలంలోనే చిన్నారి మృతి.. ఆసుపత్రిలో మరొకరు
లారీ తీవ్రస్థాయిలో ఢీకొట్టడంతో చిన్నారి సరాక్షి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ (41)ను స్థానికులు, పోలీసులు తక్షణమే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో విశ్వనాథ్ కూడా కన్నుమూశారు. ఆనందంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకల్లో కళ్లముందే చిన్నారి, బంధువు దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!