Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
- కుటుంబ విషయాలు బయటకు పొక్కితే జాగ్రత్త
- పొరుగువారి మాటల్లో కనిపించే సంకేతాలు
- అత్తాకోడళ్ల మధ్య అపార్థాలకు కారణమిదే
- కోపం కాకుండా ఇలా సమస్యను పరిష్కరించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. అయితే నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణలు, గది తలుపులు దాటి ఇరుగుపొరుగు వారికి తెలిసినప్పుడు తీవ్రమైన ఇబ్బందికి, నిస్సహాయతకు గురికావడం సహజం. ‘గోడలకు కూడా చెవులు ఉంటాయి’ అన్నట్లుగా.. మీ ఇంటి వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కడం వెనుక ఎవరైనా దొంగచాటుగా వినడమో లేక ఇంట్లోని వారే బయటి వారి ముందు నోరు పారేసుకోవడమో కారణం కావచ్చు. కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసే ఇలాంటి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడం అత్యంత అవసరం.
ఈ సంకేతాలు గమనిస్తే పొరుగువారికి అన్నీ తెలుస్తున్నట్లే
ఒకవేళ పొరుగువారు అకస్మాత్తుగా మీ వద్దకు వచ్చి “నిన్న రాత్రి మీ ఇంట్లో గొడవ జరిగిందంటగా?” అని ప్రశ్నించినా, లేదా మీ వ్యక్తిగత ప్లాన్ల గురించి నేరుగా అడిగినా అది తీవ్రమైన ప్రమాద సంకేతంగా భావించాలి. కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగిన అత్యంత రహస్య చర్చలు పొరుగువారికి చేరుతున్నాయంటే, మీ ఇంట్లోని విషయాలు బయటకు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. అటువంటి సమయంలో వెంటనే కోపగించుకోకుండా, ఇది తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయమని బయటి వారికి మర్యాదగా చెప్పి విషయాన్ని అక్కడితో ముగించడం శ్రేయస్కరం.
Also Read
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
- Kitchen Cleaning Tips: వంటగది చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!
బాధితురాలిగా నటిస్తూ సానుభూతి పొందే ప్రయత్నాలు
మీ అత్తగారు ఇంటి బయట లేదా బాల్కనీలో ఇరుగుపొరుగు వారితో సంతోషంగా కబుర్లు చెబుతున్నప్పుడు మీరు అక్కడికి వెళ్లగానే అందరూ అకస్మాత్తుగా మౌనంగా ఉండిపోవడం లేదా హడావిడిగా విషయాలు మార్చేయడం వంటివి జరిగితే, వారి చర్చకు మీరే కేంద్రబిందువు అయ్యారనడానికి అది కచ్చితమైన సంకేతం. కొందరు ఇంట్లో సాధారణంగా ఉంటూ అతిథులు లేదా పొరుగువారు రాగానే తమను తాము తీవ్రంగా వేధింపులకు గురవుతున్న నిస్సహాయురాలిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు. కోడలు తమను పట్టించుకోవడం లేదని లేదా విసిగిస్తోందని ఇతరులకు అనిపించేలా ప్రవర్తిస్తూ, బయటి వారి సానుభూతి పొంది కోడలి ప్రతిష్టను దిగజార్చేలా నడుచుకుంటారు. అత్తగారి ఈ వైఖరి వల్ల ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న పొరుగు మహిళలు మిమ్మల్ని హేళనగా చూడటం లేదా వ్యంగ్యంగా మాట్లాడటం ప్రారంభించే అవకాశం ఉంది.
కోపానికి బదులు సంయమనం.. సమస్యకు పరిష్కారం ఇదే
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే కోపపడి గొడవపడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందే తప్ప పరిష్కారం దొరకదు. అత్తగారు ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో ప్రేమగా మాట్లాడి, ఏవైనా అపార్థాలు ఉంటే మనసు విప్పి చర్చించుకోవాలి. మన కుటుంబ విషయాలను బయట చర్చించడం వల్ల మొత్తం కుటుంబ గౌరవానికే భంగం కలుగుతుందని ఆమెకు అర్థమయ్యేలా వివరించాలి. ఒకవేళ ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె వైఖరిలో మార్పు రాకపోతే, ఈ విషయాన్ని మీ భర్త దృష్టికి తీసుకెళ్లడం శ్రేయస్కరం. అత్యంత వ్యక్తిగత విషయాలను అత్తగారితో పంచుకోవడం కాస్త తగ్గించి, భర్త మద్దతుతో పరస్పర అవగాహన, సంయమనంతో మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
తాజావార్తలు
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
-
Nvidia: ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్ రాజీనామా..
-
Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!