Traffic Challans: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. కానీ మనకు తెలిసి చేసే తప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది హెల్మెట్ ధరించకుండా నడపడం. హెల్మెట్ లేకుంటే ప్రాణం పోతుందని తెలిసినా.. పట్టించుకోకుండా నాకు నెత్తిమీద జుట్టు ఉంటే చాలనుకు వారి సంఖ్య లక్షల్లో ఉంది. అయితే.. ఈ 5 నెలల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు 11.5 లక్షల జరిమానా విధించారు. ఈ ఒక్క పాయింట్ చాలు.. హెయిర్ స్టైల్ ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పడానికి. ఇక మరోవైపు హెల్మెట్ ధరించినా నిబంధనలను ఉల్లంఘించే మేధావులు కూడా ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్‌లో ఫోన్‌ను అతికించుకుంటారు. అలాంటి వారికి 31 వేల చలాన్లు వేశారు పోలీసులు.
Read also: Child Selling: కన్న కూతురిని లక్ష రూపాయలకు అమ్మిన కసాయి తండ్రి..
ఇక మరొకటి సిగ్నల్ జంప్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడైనా ఆరెంజ్ సిగ్నన్ పడితే నెమ్మదిగా వెళతారు.. ఎరుపు పడితే ఆగిపోతారు. అదేమిటంటే.. రెడ్ సిగ్న ల్ చూసి రైయ్ అని వెళ్లాలని మనసు కుతూహలంగా కొట్టుకుంటుంది అదేంటో మూర్ఖత్వం కాకపోతే.. ఇలా రెడ్ సిగ్నల్ చూడగానే ఆగకుండా వెళ్లిపోయే అలాంటి వారికి 34 వేల చలాన్లు వేశారు. అలాగే ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ గురించి చెప్పాలంటే.. అలాంటి వారికి 35 వేల చలాన్లు జారీ చేశారు. అన్ని నిబంధనలు పాటించకుంటే చలాన్ రాదని కొందరు అంటున్నారు. అదే నంబర్ ప్లేట్‌పై మాస్క్‌లు పెట్టేవారు. అంకెలు కనిపించకుండా గారడీ చేస్తారు. అలాంటి వారికి 37 వేల చలాన్లు ఇచ్చారు. ఇవన్నీ కలిపి కేవలం 5 నెలల్లో 18 లక్షల చలాన్లు అంటే సగటున నెలకు 3.5 లక్షల చలాన్లు. అంటే ఇవన్నీ కేవలం 5 నెలలకే అంత అయ్యిందంటే ఇక మరో ఏడాదిలో ఆ సంఖ్య ఎక్కడికి పోతుంది? చలాన్లు వేస్తే కట్టేస్తాం అనుకోవద్దు. ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అధికారులు. మీ పర్సులోని డబ్బును కాపాడుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం మంచిది అంటున్నారు అధికారులు..
Kishan reddy: ఆ రెండు పార్టీలు కవల పిల్లలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు