Child Selling: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్ నగర్ ప్రాంతంలో అసిఫ్, అస్మా దంపతలు నివసిస్తున్నారు. అసిఫ్ తన భార్య అస్మాను బెదిరించి వారి 18 రోజుల పాపను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ కు లక్ష రూపాయలకు చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా విక్రయించాడు. వెంటనే ఈ విషయాన్ని అస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించింది. ఇందుకు సంబంధించి కేస్ నమోదు చేసుకొని బండ్లగూడ పోలీసులు 24 గంటల లోపే బాధిత 18 రోజుల బాలికను కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి రక్షించి తల్లికి అప్పగించారు.
Hardik Pandya – Natasa : హార్దిక్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటాషా స్టాంకోవిచ్..?
ఈ కేసులో బాధిత బాలిక తండ్రి అసిఫ్, మధ్యవర్తి చాంద్ సుల్తాన, బాలికను కొన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. దింతో 24గంటల్లో కూతురును తల్లి అస్మా బేగంకు చేరడంతో అస్మా బేగం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసులకు బాధిత కుటుంబ బంధువులు, స్థానిక ప్రజలు బండ్లగూడ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Vande Bharat Sleeper: ఆరోజే సికింద్రాబాద్ నుండి మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణం..