హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. శుక్రవారం హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం ఉన్న నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా.. మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం.. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు 2 గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుందని.. . తిరిగి మరుసటిరోజు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు యథావిధిగా నడుస్తాయని.. ప్రయాణీకులు మెట్రో సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..
Read Also: Ganesh Nimajjanam 2022: వారికి శుభవార్త.. వీరికి మాత్రం బ్యాడ్ న్యూస్..
కాగా, గణేష్ నిమజ్జనం నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. శుక్ర, శనివారల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. దీంతో.. 9,10 తేదీల్లో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. దీంతో, గణేష్ నిమజ్జనం చూసేందుకు వచ్చే ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. కానీ, మెట్రో రైల్ సర్వీసులతో ఆ బాధ తప్పింది.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన అవసరం లేకుండా.. నిమజ్జనానికి వెళ్లేందుకు ఇది ఎంతో దోహదపడనుంది.