Ganesh Nimajjanam 2022: వారికి శుభవార్త.. వీరికి మాత్రం బ్యాడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రేపు గణేష్ నిమజ్జనం సాగనుంది.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు భక్తులు.. అయితే, హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… మహా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా గణపయ్యకు బైబై చెప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు.. అయితే, ఈ సందర్భంగా అందరికీ శుభవార్త వినిపించిన ప్రభుత్వం.. మందు బాబులకు మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది… వినాయక నిమజ్జనం సందర్భంగా… శుక్రవారం రోజు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది సర్కార్… అయితే, శుక్రవారానికి బదులుగా నవంబర్ 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
Read Also: 4 Year old Saves Mother’s Life: నాలుగేళ్ల బుడతడు.. తల్లి ప్రాణాలు నిలిపాడు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఇక, బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీఓ గణేష్ నిమజ్జనం సందర్భంగా.. రెండు రోజుల పాటు.. శుక్రవారం, శనివారం (సెప్టెంబర్9, 10 తేదీల్లో) మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.. అయితే, శనివారం సాయంత్రం తిరిగి తెరుచుకోనున్నాయి మద్యం షాపులు.. వినాయక నిమజ్జనం నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్.. జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.. ఈ సమయంలో.. కల్లు దుకాణాలు, వైన్స్, బార్, లిక్కర్‌కు సంబంధించిన అన్ని షాపులు మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!