high court orders on chikoti praveen petition seek for secuirty to him and hisfamily: క్యాసినో వ్యవహారంలో సంచలనంగా మారిన చీకోటి ప్రవీణ్ వినతిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్ తనకు, తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని, పోలీస్ భద్రత కల్పించాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ED దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలని కోరారు. ఈ నెల 4న వినతి పత్రం ఇచ్చినప్పటికీ పోలీసులు సహకరించడం లేదని తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు.. అతని వినతిని వారంలో పరిశీలించాలని హైదరాబాద్ సీపీ ని ఆదేశించింది.
ప్రవీణ్ చికోటి కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో తాను రాజకీయ నేతల పేర్లు బయట పెట్టానని తప్పుడు ప్రచారం జరుగుతోందని, తన కుటుంబానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. దాంతోపాటుగా తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ప్రవీణ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. చికోటితో పాటుగా తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులను కోరినట్లు వివరించారు. అయితే పోలీసుల నుంచి ఏస్పందన రాలేదన్నారు. దీంతో..ప్రవీణ్ వాదనలు విన్న హైకోర్టు ప్రవీణ్ దరఖాస్తును వారంలో పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఈడీ కేసినో వ్యవహారంలో ప్రవీణ్ తో పాటుగా మరి కొందరి నివాసాల్లో సోదాలు చేసి.. కీలక అధారాలు సేకరించింది. ఈనేపథ్యంలో.. మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈనేపథ్యంలో ప్రవీణ్ ఎవరితో లావా దేవీలు నిర్వహించారనే అంశం పైన ఆరా తీసారు. ప్రవీణ్ హవాలా మార్గంలో ద్రవ్యమారకం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది.
Munugodu By Election: మునుగోడులో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ.. అభ్యర్థి ఆయనే..?