అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారం ఢిల్లీకి చేరింది.. ఇప్పటికే అనంతపురం ఎస్పీ అది ఫేక్ వీడియోఅని ప్రకటించారు.. ఆ తర్వాత విపక్షాలపై వైసీపీ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. అయితే, ఆ వ్యవహారం అంతటితో ఆగిపోలేదు.. ఎంపీ మాధవ్‌పై పంజాబ్‌కు చెందిన ఓ ఎంపీ, తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై సీరియస్‌గా స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
Read Also: Munugodu By Election: మునుగోడులో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ.. అభ్యర్థి ఆయనే..?
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ… మాధవ్ పై వచ్చిన న్యూడ్ వీడియో కాల్ ఆరోపణలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు.. మరోవైపు, న్యూడ్ వీడియో అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీని ఆదేశించారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ. ఇక, మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ ఫిర్యాదు చేశారు. ఎంపీ గోరంట్ల వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఇది ఎంపీలకు మాయని మచ్చలా ఉందని.. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని అని లేఖలో పేర్కొన్నారు.. ఆ వీడియోపై దృష్టి సారించి.. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మహిళా కమిషన్‌ను లేఖలో కోరారు ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్.. దీంతో, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో హీట్ పుట్టించిన మాధవ్ వ్యవహారం.. ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లినట్టు అయ్యింది.