Munugodu By Election: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడులో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. లక్ష మందితో సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 20న మునుగోడులో టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాటుకు సభాస్థలిని నల్గొండ నేతలు ఇవాళ పరిశీలించనున్నారు. మునుగోడు ప్రజాదీవెన పేరుతో లక్ష మందితో సభ నిర్వహణ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఖాయమని తెలుస్తోంది? భారీ బహిరంగ సభలో మునుగోడులో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మునుగోడులో ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మండలాల వారిగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యత అప్పగించారు సీఎం కేసీఆర్.
read also: USA: ఎఫ్ బీ ఐ ఆఫీస్ పై దాడికి యత్నం.. దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు
ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్, మునుగోడు ఉప ఎన్నిక సీరియస్ గా తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఉప ఎన్నిక తనపై బీజేపీ చేస్తున్న కుట్ర అని నేతలకు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తాను యాక్టివ్ అవుతుంటే అడ్డుకునే క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వదిలేది లేదన్నారు కేసీఆర్. బీజేపీ కంటే ముందుకు కానే కేసీఆర్ 20న భారీ బహిరంగ సభకు పూర్తీ ఏర్పాట్లు చేయాలని , లక్షమందితో మునుగోడు సభ వుండానలి పేర్కొన్నారు.
బీజేపీ-టీఆర్‌ఎస్ సభః
అయితే.. ఈ నెల 21న చౌటుప్పల్‌లో ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభ ద్వారా బీజేపీ ముఖ్యనేత అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు అనేక మంది నేతలు ఆరోజు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చతో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకుంది. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని చర్యలు చేపట్టింది. దీంతో అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పట్లు షురూ చేసింది. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అయితే.. ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టన విసయం తెలిసిందే.
USA: ఎఫ్ బీ ఐ ఆఫీస్ పై దాడికి యత్నం.. దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు