Malakpet: హైదరాబాద్ మలక్‌పేటలో హైకోర్టు అడ్వకేట్ రెచ్చి పోయి హంగామా చేశాడు. ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో మహిళను, యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఒక మహిళా అని చూడకుండా ఇంట్లోకి వెళ్లి నానా హంగామా చేశాడు. మహిళను చేతులు పట్టుకుని బయటకు లాక్కుని వచ్చి ఇంటి ముందు గొడవకు దిగాడు. ఈ ఘటన మలక్ పేట పీఎస్ పరిధిలో సంచలనంగా మారింది. ముసారాంబాగ్ లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో ఆంటోనీ రెడ్డి అలియాస్ క్రాంతి రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ప్లాట్ ముందు చెత్త వేశారని కారణంతో పక్కింటి ఇంట్లో చొరబడి దాడి చేశాడు.
Read also: KTR Delhi Tour: నేడు హరిదీప్ సింగ్ తో కేటీఆర్ భేటీ.. ఇంకా ఖరారు కాని అమిత్ షా అపాయింట్మెంట్..?
అంతేకాకుండా ఇంట్లో వున్న ఆడవారిని చేతులు పట్టుకుని ఇంటి బయటకు లాక్కుని వచ్చాడు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దాడి చేశాడు. వారికి పిడుగుద్దులు గుద్దాడు. అయితే అతన్ని అడ్డుకునేందుకు పలువురు అడ్వకేట్‌లు ప్రయత్నించినా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారిపై కూడా దాడి చేశాడు. అలా మహిళను చేతులు పట్టుకుని లాక్కుని రావడం ఏంటని ప్రశ్నిస్తున్నా వినకుండా నేను హైకోర్టు అడ్వకేట్ అంటూ ఎరికి చెప్పకుంటారో చెప్పుకోండి అని బెదిరించాడు.
అడ్వకేట్ దాడిలో గాయపడిన బాధితులు మలక్ పేట పీఎస్ పరిధిలో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.గాయపడిన మహిళా. మరొకరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితులు మాట్లాడుతూ.. మొఖం పై పిడిగుద్దులు గుద్దాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కడుపులో తన్నాడని బాధితులు ఆరోపించారు. తాను హైకోర్టు అడ్వకేట్ నని ఎవరికి చెప్పుకుంటారో చెపుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని అన్నారు. ఒక హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి ఒక మహిళపై దాడి చేయడం ఏంటి మండిపడుతున్నారు. ఇంట్లో చొరబడి కుటుంబ సభ్యుల ముందరే మహిళపై దాడి చేసి, చేతులు పట్టుకుని బయటకు లాక్కుని వెళ్లడం దారుణం మని అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరి దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైకోర్టు అడ్వకేట్ ను అదుపులో తీసుకున్నారా? లేక విచారిస్తున్నారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్స్ ఖర్జూరాలు తినొచ్చా.. షుగర్ లెవెల్స్ పెరుగుతాయా?!