Telangana cabinet meeting: కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.
దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దీపావళిని స్థానిక ఉత్పత్తులతో జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ సూచించారు.
ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నిజామాబాద్ లోని సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నేటి నుంచి నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిసాలకు నిజామాబాద్ బయలుదేరి, టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని అధ్యక్ష సీటులో కూర్చోబెట్టనున్నారు. ఈనేపథ్యంలో.. నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, పూజల నిర్వహించిన…
CM KCR Wishes Adivasis: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ముహర్రం సందర్భంగా తెలంగాణ సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఆదివాసీయులందరికి ప్రభుత్వం అండగా వుంటుందని పేర్కొన్నారు. మానవీయ సంబంధాలకు మమతాను రాగాలకు కల్మశం లేని ఆదివాసీలు ప్రతీకలని సీఎం వ్యాఖ్యానించారు. ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమం కోసం స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేసారు. మా తండాలో మా రాజ్యం అనే ఆదివాసి గిరిజన ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని…