* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు ఉదయం 9.30 గంటలకు బంగ్లాదేశ్‌తో నెదర్లాండ్స్ మ్యాచ్..
* టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సౌతాఫ్రికాతో జింబాబ్వే ఢీ..
* దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రేక్.. ఢిల్లీకి వెళ్లిన రాహుల్
* ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలులో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు..
* ఒంగోలు కేశవస్వామిపేట చెన్నకేశవ స్వామి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ధనలక్ష్మి పూజ..
* గుంటూరు: వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు నోడల్ డివిజన్ పరిధిలో, ఉద్యోగుల బదిలీల అవకతకలపై విచారణ కు ఉన్నతాధికారుల ఆదేశాలు, అడిషనల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగనున్న విచారణ…
* గుంటూరు: దీపావళి పండుగ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా లో ప్రతి సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసిన అధికారులు…
* గుంటూరు: రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా ఈనెల 25 వరకు తాడేపల్లి పరిధిలోని కొలనుకొండ రైల్వే గేటు మూసివేత.
* నెల్లూరు జిల్లా: ముత్తుకూరు మండలం నెలటూరులో జరిగే ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంపై పార్టీ నేతలతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమావేశం.
* దీపావళి సందర్భంగా నెల్లూరులోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు.. సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు.
* అనంతపురం : సూర్యగ్రహణం నేపథ్యంలో ఈనెల 25న కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయం మూసివేత.
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. సాయంత్రం పల్లకి సేవ
* నంద్యాలలోని గాంధీ చౌక్ లో నేడు గులాబ్ షా వలి దర్గాలో ఉరుసు ఉత్సవం