Godavari Flood: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంకి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే 43 అడుగులకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత ఏడాది ఇదే సమయంలో గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహించింది.. అయితే అంతటి స్థాయిలో ఇప్పటికిప్పుడు గోదావరికి వరద వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు వస్తున్నప్పటికీ ప్రమాదకర స్థాయిలో మాత్రం వర్షాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరో ఐదు నుంచి పది అడుగుల వరకు గోదావరి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు వదిలిపెడితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉన్నట్లుగా సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్లమండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. 21 గేట్లను ఎత్తి వేసి 47437 క్యూసెక్కులు నీరు దిగువకు గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 71.64 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 44886 క్యూసెక్కులు కొనసాగుతుంది.
Read also: Milind Soman: 52ఏళ్లలో 25ఏళ్ల అమ్మాయిలతో పెళ్లిళ్లు.. మరి వివాదాలు రావా బాసూ!
ఇక కామారెడ్డి జిల్లాలో వర్షాల నేపథ్యంలో అధికారుల అప్రమత్తమయ్యారు. కామారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాల వల్ల సమస్యలు ఏర్పడితే 08468-220069 కి కాల్ చెయ్యాలని కలెక్టర్ సూచించారు. శిథిలావ్థలో ఉన్న ఇళ్ల వద్ద ఎవరూ ఉండొద్దని సూచించారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద 11 మీటర్ల కు నీటిమట్టం చేరింది. వాజేడు,వెంకటాపురం మండలంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాజేడు మండలం పేరూరు దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దని అధికారులు అంటున్నారు.
Crime News: పూలు కోసుకెళ్లమని పిలిచి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం