GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్ లో ఓయో రూమ్స్ రగడ.. హాట్‌హాట్‌గా మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రెండో రోజు వాడివేడిగా సాగుతోంది. ఇవాళ ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే GHMC కౌన్సిల్ హల్ లో ఓయో రూమ్స్ రగడ మొదలైంది. ఓయో రూమ్స్ పై కార్పొరేటర్లు హాట్ హాట్ గా మాటల యుద్ధం జరిగింది. రెసిడెన్సీయల్ పేరుతో కమర్షల్ నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిసినెస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెంట్స్ పేరుతో కమర్షల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే GHMC పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓయో రూమ్స్ నిబంధనల పై క్రాస్ చెక్ చెయ్యాలి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
Read also: Kishan Reddy: విజయసంకల్ప రథ యాత్రలకు బీజేపీ శ్రీకారం.. ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఈ సందర్భంగా కౌన్సిలర్లు ప్రజా సమస్యలను సభలో లేవనెత్తారు. హైదరాబాద్‌లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోట్స్ తక్కువగా ఉన్నాయని, ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల పట్ల అధికారులు కుక్కల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కనీసం అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. కాగా, నిన్నటి కౌన్సిల్ సమావేశం హాట్ హాట్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్న భోజనానికి ముందు గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చ జరగనుంది. భోజనం తర్వాత, మేయర్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.8437 కోట్ల GHMC బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.7937 కోట్లతో సాధారణ బడ్జెట్, డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.500 కోట్లతో బడ్జెట్ రూపొందించారు.
Rahul Gandhi: అమిత్ షాపై కామెంట్స్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!