ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించేందుకు.. అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ వచ్చాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు.. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం..
ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్, భయాందోళనకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు అందరినీ అలజడికి గురి చేస్తున్నాయి.. ముఖ్యంగా సినీ, రాజకీయ నాయకులను భయ బ్రాంతులకు గురి చేస్తుంది.. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రేటీల వీడియోలు బయటకు వచ్చాయి.. ఇలాంటి వీడియోలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది..
ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించింది. ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు మిస్-ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్, మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్టు తెలుస్తుంది.. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్ డిజైన్ చేశారు. దీనికి డీప్‌ఫేక్, నకిలీ సమాచారాన్ని పంపడం ద్వారా వాటిని కట్టడి చేసే వీలుంటుందని చెబుతున్నారు. వచ్చే నెలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఈ సేవలు అన్నీ భాషల్లో రానున్నాయి.. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది..