Nude video call Gadwal: గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు కామాంధులు. మహిళలను మాటలతో ముగ్గులోకి దించి న్యూడ్ వీడియోకాల్ చేసేవిధంగా ట్రాప్ చేస్తున్నారు. వారు చేసిన న్యూడ్ వీడియోలను రికార్డ్ చేసి వారికే పంపించి బ్లాక్ మైయిల్ చేస్తున్నారు. వారి ట్రాప్ లకు మోసపోయిన బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై చర్యలు మొదలుపెట్టారు. ఇద్దరిపై కేసునమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.
Read also: Roger Binny: అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ చీఫ్ ఆగ్రహం.. టీమిండియాకు ఐసీసీ ఎలా సహకరిస్తుంది?
మహేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిఖిల్ కోసం గాలిస్తున్నారు. ప్రేమపేరుతో మహిళలు,విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు. మహిళలు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేలా చేసి దానిని రికార్డ్ చేస్తున్నారు. తరువాత బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు తాము చెప్పిన వారితో గడపాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. లేదంటే ఆవీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని మహిళలకు బ్లాక్ మైయిల్‌లకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిలో ఒకరిని అదుపులో తీసుకున్నారు. అయితే మహిళలు, విద్యార్థినులు ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చారిస్తున్నారు. కాల్ చేసేప్పుడు అందరిని నమ్మి మోసపోవద్దని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఒకవేళ ఇలాంటి కేటుగాళ్లు ఉంటే వారిపై పోలీసులకు సంప్రదించాలని కోరారు.