Tummala Nageswara Rao : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పత్తి విత్తనాలను సరఫరా చేసిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేందుకు సీడ్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గద్వాల జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోందని, రైతులు విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు అందించినప్పటికీ వారికి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని…
Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు…
Tejeshwar Murder : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో…
Road accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోనుపాడు సమీపంలోని పర్చర్లమిట్ట వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఆటోను ఢీకొంది.
గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు కామాంధులు. మహిళలను మాటలతో ముగ్గులోకి దించి న్యూడ్ వీడియోకాల్ చేసేవిధంగా ట్రాప్ చేస్తున్నారు.
పారిశ్రామికీకరణతో ఉద్యోగాలు వస్తాయని భావించినవారికి నిరాశే ఎదురైంది. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఎస్ఎన్ఎస్ కంపెనీ వెదజల్లుతున్న వ్యర్ధాలతో వాయు కాలుష్యం నీటి కాలుష్యం వల్ల పోరాటాలు చేసి అలిసిపోయి బ్యూరోక్రాట్స్ ముందు నిరసన తెలుపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎస్ఎన్‌ఎస్ అనే పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ వ్యర్థాలతో దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న…