కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. హీనంగా చూడకోయ్ దేన్నీ.. కవితామాయయేనోయ్ అన్నీ.. తలుపుగొళ్ల, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం.. కాదేదీ కవితకు కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు.. కేటుగాళ్లు.. ఇదే ఫాలో అవుతున్నారు.. కాకపోతే కవితలు కాదు.. మోసాలు.. బ్యాంకులు, వ్యాపారులకు, వ్యాపారులతో పేరుతో ప్రజలకు.. ఇలా చిన్నస్థాయి నుంచి.. పెద్ద స్థాయి వరకు ఎవరినీ వదలకుండా.. కోట్లకు కోట్లు లాగేస్తున్నారు. ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదన మార్గం, ప్రభుత్వోద్యోగాల పేరుతో కొందరు, కరక్కాయలు పొడి చేసి ఇస్తే భారీగా డబ్బిస్తామంటూ మరికొందరు.. ఇలా ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు కొట్టేస్తున్న కేటుగాళ్లు ఎందరో.. తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.. దీపం వత్తులు, బొట్టు బిల్లల పేరుతో ఏకంగా రూ.200 కోట్లు టోకరా పెట్టాడు.
Read Also: Raja Singh: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రాజా సింగ్.. సర్జరీ చేసిన వైద్యులు
దీపం వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని.. బొట్టు బిల్లల తయారీ యంత్రంతో పాటు.. ముడి సరుకులు మేమే ఇస్తామని ఎంతో మందిని బుట్టులో వేసుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా రూ.200 కోట్లు మోసం చేశాడు.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడలో ఈ భారీ మోసం వెలుగు చూసింది.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యికిపైగానే బాధితులు ఉన్నారంటే.. మోసం ఏస్థాయిలో అర్థం చేసుకోవచ్చు.. ఏఎస్ రావు నగర్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి ఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు..
దీపం వత్తులు, బొట్టు బిల్లల తయారీ యంత్రాలతో పాటు.. ముడి సరుకు తానే ఇస్తానని నమ్మబలికాడు.. అంతేకాదు, తను ఇచ్చే ముడి సరుకు తయారు చేసి ఇస్తే.. డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చారు.. ఇది నమ్మిన ప్రజలు.. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. ఇలా ప్రారంభమై.. దాదాపు 1100 మంది వరకు చేరారు.. మొత్తంగా దీపం వత్తులు, బొట్టు బిల్లల తయారీ పేరుతో ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు.. కొంతకాలం ఈ వ్యవహారం సాగినా.. ఆ తర్వాత చేసి చెత్తులెత్తేశాడు.. అయితే, ఇటీవల కంపెనీ బోర్డ్ తీపివేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.. వారి పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.