కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. హీనంగా చూడకోయ్ దేన్నీ.. కవితామాయయేనోయ్ అన్నీ.. తలుపుగొళ్ల, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం.. కాదేదీ కవితకు కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు.. కేటుగాళ్లు.. ఇదే ఫాలో అవుతున్నారు.. కాకపోతే కవితలు కాదు.. మోసాలు.. బ్యాంకులు, వ్యాపారులకు, వ్యాపారులతో పేరుతో ప్రజలకు.. ఇలా చిన్నస్థాయి నుంచి.. పెద్ద స్థాయి వరకు ఎవరినీ వదలకుండా.. కోట్లకు కోట్లు లాగేస్తున్నారు. ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదన…