KCR: అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్‌ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు మంచిరోజు కావడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా శాసనసభకు వచ్చారు. కాగా..ఇదే రోజు కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేతగా కె.చంద్రశేఖర్ కొనసాగుతారని స్పష్టమైంది.
Read also: Vijay Thalapathy : త్వరలోనే విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..పార్టీ పేరు పిక్స్?
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఈసారి 39 సీట్లకే పరిమితమైంది. 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది అదే నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు ప్రమాదవశాత్తూ కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఎడమ కాలులో తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాన్ని కోల్పోయారు. తాజాగా ఆయన కోలుకుని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక శక్తి బీఆర్‌ఎస్ పార్టీ అని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ ఎంపీలు గళం విప్పాలని కేసీఆర్ ఆదేశించారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు.
YSRCP: ఒంగోలు ఎంపీ స్థానానికి దాదాపు అభ్యర్థి పేరు ఖరారు.. ఆయనే ఫైనల్..!
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!