తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తాయి.. ఏదొక దానిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి.. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇటీవల మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో అందరు కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు..
అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. హీరో విజయ్ ఇప్పటికే పలుమార్లు తన అభిమాన సంఘాలతో వరుస సమావేశాలు పెడుతూ వచ్చాడు. ఈక్రమంలో ఈసమావేశాల్లోనే పార్టీ పేరును కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పేరును కూడా రిజిస్టర్ కూడా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ తాజాగా చెన్నైలోని పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండా ఇలా అనేక విషయాల్లో క్లారిటీకి వచ్చారట.
ఈ క్రమంలో పార్టీకి తమిళనాడు సెంటిమెంట్ కలిసి వచ్చేలా.. తమిళ మున్నేట్ర కళగం పేరును అందరు అనుకుని ఫిక్స్ చేశారట.. విజయ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాడట. అలాగే కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ఇచ్చి.. పొలిటికల్ గా నిలబడ్డ తరువాత.. మళ్ళీ మొదలెట్టేఆలోచనలో ఉన్నాడట దళపతి.. అంతేకాదు మరో వార్త కూడా వినిపిస్తుంది.. ఇక సినిమాలకు ఈ హీరో శాశ్వతంగా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్..