Income Tax: వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకటించారు. ఇంతకు ముందు పాత ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేల రూపాయల వరకు మినహాయింపు ఉండేది.. కానీ, దాన్ని 25 వేల రూపాయలకు వరకు పొడిగించింది. అంటే 2.50 లక్షల రూపాయల నుంచి 3.25 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక కొత్త పన్ను విధానంలో 7 లక్షల రూపాయల ఆదాయం వరకూ పన్ను రాయితీ కల్పించింది. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పన్ను చెల్లింపు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది.
Read Also: Grama Panchayathi: ముగిసిన సర్పంచ్ పాలన.. డిజిటల్ కీలు తీసుకోవాలని ఆదేశం..
ఇక, ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుల విధానం యథాతథంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి 23.24 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే, ఎగుమతి, దిగుమతి సుంకాల విధానం యధాతథంగా కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొనింది.